శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు “మన పర్యావరణం మన బాధ్యత” కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పేట బ్రదర్స్ ఆధ్వర్యంలో ప్రతి నెల మొదటి, మూడవ శనివారాలు మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా, శనివారం తొట్టంబేడు మండలంలోని గురుకులపాలెంలో మొక్కలు నాటారు. ప్రజల్లో పర్యావరణ చైతన్యాన్ని పెంపొందించేందుకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు.