శ్రీకాళహస్తిలోని ఖుబ మసీదులో ముస్లిం మత పెద్దలు సమావేశమై వివాహ వేడుకలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇకపై ముస్లిం వివాహాలను మసీదుల్లోనే నిర్వహించాలని, వేడుకల్లో డాన్స్, డీజే వంటి కార్యక్రమాలను నిషేధించాలని నిర్ణయించారు. ఈ నిబంధనలను పర్యవేక్షించడానికి 11 మంది సభ్యులతో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ నిబంధనలను అతిక్రమించిన వారికి సనద్, మ్యారేజ్ సర్టిఫికెట్లు ఇవ్వకూడదని స్పష్టం చేశారు.