శ్రీకాళహస్తి;ఇసుకతాగేలి చెరువును పరిశీలించిన అధికారులు

8చూసినవారు
శ్రీకాళహస్తి;ఇసుకతాగేలి చెరువును పరిశీలించిన అధికారులు
ఏర్పేడు మండలం ఇసుకతాగేలి చెరువుకు వరదనీరు చేరి గండి పడింది. మంగళవారం సమాచారం అందుకున్న వెంటనే ఏర్పేడు తహసీల్దార్ భార్గవి, ఎంపీడీవో డా. సౌభాగ్యమ్మ చెరువు వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అధికారులు గండి ఏర్పడిన ప్రాంతాన్ని పరిశీలించి, నీటి వృథాను అరికట్టేందుకు తక్షణ చర్యలు ప్రారంభించారు. చెరువు కింద ఉన్న సాగుభూములకు ప్రమాదం వాటిల్లకుండా సంబంధిత శాఖలతో కలిసి పునరుద్ధరణ పనులను వేగవంతం చేస్తున్నారు. ఈ పరిశీలనలో ఇరిగేషన్ జేఈ జయకుమార్, నీటి సంఘం అధ్యక్షుడు మునిరామిరెడ్డి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్