రేణిగుంట మండలంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీకాళహస్తి మండలం కలవగుంట ఎస్టీ కాలనీకి చెందిన గిలకల వెంకట రమణయ్య (38) మృతిచెందారు. ఆయన తన స్నేహితుడు గంగాధర్ తో కలిసి బైకుపై రైల్వే కోడూరుకు వెళ్తుండగా, ఉగాది హోటల్ సమీపంలో ఎదురుగా వస్తున్న ఆటో బైక్‌ను ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన రమణయ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ ఘటనపై ఆటో డ్రైవర్ వాసుపై రేణిగుంట పోలీసులు కేసు నమోదు చేశారు.