శ్రీకాళహస్తి: దెబ్బతిన్న రోడ్లను పరిశీలించిన స్పెషల్ ఆఫీసర్

10చూసినవారు
శ్రీకాళహస్తి: దెబ్బతిన్న రోడ్లను పరిశీలించిన స్పెషల్ ఆఫీసర్
మొంథా తుఫాను కారణంగా తొట్టంబేడు మండలంలోని పలు రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. శుక్రవారం స్పెషల్ ఆఫీసర్ ఈ రోడ్ల పరిస్థితిని పరిశీలించారు. కంచనపల్లి హరిజనవాడ సమీపంలో వర్షపు నీటి ప్రవాహంతో ఆర్అండ్ బీ రోడ్డుకు గండి పడటాన్ని ఆయన పరిశీలించారు. ఎంపీడీవో సురేంద్రనాథ్, తహశీల్దార్ భారతి కూడా ఆయనతో పాటు ఉన్నారు. దెబ్బతిన్న రహదారుల మరమ్మతులపై జిల్లా స్థాయి అధికారుల దృష్టికి విషయాన్ని తీసుకువెళ్తామని స్పెషల్ ఆఫీసర్ తెలిపారు.

ట్యాగ్స్ :