శ్రీకాళహస్తి పట్టణ ప్రజలకు టూ టౌన్ పోలీస్ స్టేషన్ కార్యాలయం కొత్త ప్రాంతానికి మార్చినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు నంది సర్కిల్ వద్ద కొనసాగిన స్టేషనను ఇకపై సీతాలమ్మ గుడి సమీపంలో నిర్వహించనున్నట్లు డి. ఎస్. పి నరసింహమూర్తి, టూ టౌన్ సీఐ కే. నాగరాజు వెల్లడించారు. ప్రజలు, ఫిర్యాదుదారులు ఇకపై కొత్త కార్యాలయాన్నే సంప్రదించాలని వారు కోరారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీసు శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.