శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం గోశాలలో బయోగ్యాస్ యూనిట్ ఏర్పాటుపై సీఎస్ఐఆర్ ప్రతినిధులు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కన్సల్టెంట్లు మంగళవారం పరిశీలించారు. గోశాలలో ఉత్పత్తి అయ్యే పేడ, ఇతర వ్యర్థాలను ఉపయోగించి బయోగ్యాస్ ఉత్పత్తి చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణ, ఇంధన పొదుపు లక్ష్యాలను సాధించే అవకాశాలను అధ్యయనం చేయనున్నట్లు తెలిపారు.