తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో పెండింగ్ వేతనాలు, హోదా సమస్యల పరిష్కారం కోరుతూ కార్మికుల నిరసన 62వ రోజుకు చేరింది. గురువారం డైరెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించి భారీ ధర్నా నిర్వహించారు. సిఐటియు నేత కందారపు మురళి నేతృత్వంలో జరిగిన ఈ ఆందోళనలో పోలీసులతో వాగ్వివాదం చోటుచేసుకుంది. టీటీడీ యాజమాన్యం తక్షణమే స్పందించి సమస్యలు పరిష్కరించకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని యూనియన్ నేతలు హెచ్చరించారు.