శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మంగళగిరిలో జరిగిన
టీడీపీ జాతీయ, రాష్ట్ర కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేదల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అణగారిన వర్గాలకు అండగా నిలుస్తుందని తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు
టీడీపీ ప్రాధాన్యం ఇస్తోందని, నందమూరి తారక రామారావు ఆశయాలకు అనుగుణంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్లు అవకాశాలు కల్పిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.