పేద ప్రజల సంక్షేమం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధే తమ అజెండాగా పనిచేసే తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అణగారిన వర్గాలకు అండగా నిలుస్తుందని శ్రీకాళహస్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కొనియాడారు. బుధవారం మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ జాతీయ, రాష్ట్ర కమిటీ కార్యవర్గ సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసిన శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డిని రాష్ట్ర కార్యదర్శులు డా. జి. దశరథాచారి, యం. సుబ్బయ్య దుశ్శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉమేష్ రావు, వజ్రం కిషోర్, మినరల్ రవి వంటి తెలుగుదేశం నేతలు పాల్గొన్నారు.