టిడిపి నాయకుడు గాంధీనాయుడు మృతి బాధాకరం

10చూసినవారు
టిడిపి నాయకుడు గాంధీనాయుడు మృతి బాధాకరం
శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలం శివనాధపాలెం గ్రామానికి చెందిన గాంధీనాయుడు రాత్రి నిద్రపోతూ తెల్లవారుజామున మృతి చెందారు. ఆయన కుమార్తె నిద్రలేపినా స్పందించకపోవడంతో చుట్టుపక్కల వారు వచ్చి చూడగా అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ మాజీ మండల అధ్యక్షుడు గాలి మురళినాయుడు గాంధీనాయుడు భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన కుమారుడు ధనశేఖర్‌ను ఓదార్చి, మనోధైర్యంతో ముందుకు సాగాలని సూచించారు.

సంబంధిత పోస్ట్