శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని రేణిగుంట మండలం కృష్ణాపురంలో భూ కబ్జాదారులు రెచ్చిపోయారు. వివాదాస్పద భూమిలోకి ఎవరూ వెళ్లకూడదని తహసీల్దార్ 145 నోటీసులు జారీ చేసినప్పటికీ, అక్రమార్కులు బెదిరింపులకు పాల్పడి, రాత్రికి రాత్రే ఫెన్సింగ్ తొలగించి, సిమెంట్ రాళ్లను పగలగొట్టి ధ్వంసం చేశారు. అధికారుల ఆంక్షలు అమలులో ఉన్నప్పుడే ఈ దౌర్జన్యం జరగడం స్థానికంగా కలకలం రేపుతోంది.