శ్రీకాళహస్తీలో ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డి హత్యకు నిరసనగా, నిందితుడైన ఎర్రచందనం స్మగ్లర్ తమీమ్‌ను ఎన్కౌంటర్ చేయాలని ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ తిరుపతి జిల్లా అధ్యక్షుడు శివమూర్తి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వి కోట మండలం సరిహద్దు ప్రాంతంలో స్మగ్లింగ్, అసాంఘిక కార్యకలాపాలపై వార్తలు రాస్తున్నందునే ఈ హత్య జరిగిందని ఆయన ఆరోపించారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌పై జగన్మోహన్ రెడ్డి కథనం రాయడమే ఈ హత్యకు కారణమని శివమూర్తి పేర్కొన్నారు.