అయ్యప్ప స్వామి విగ్రహ ప్రాంగణం శుభ్రపరిచిన సేవాసమితి

4చూసినవారు
అయ్యప్ప స్వామి విగ్రహ ప్రాంగణం శుభ్రపరిచిన సేవాసమితి
శ్రీకాళహస్తి పట్టణంలోని నంది హిల్స్–తుఫాన్ సెంటర్ మార్గమధ్యంలో ఉన్న అయ్యప్ప స్వామి విగ్రహం వద్ద భక్తులకు ఇబ్బందులు కలుగుతున్న నేపథ్యంలో, శబరిమల అయ్యప్ప స్వామి వారి తత్వమసి సేవా సమితి ఆధ్వర్యంలో శుభ్రత కార్యక్రమం చేపట్టారు. 2017లో ప్రతిష్టించిన ఈ విగ్రహం వద్ద పూజా కైంకర్యాలు సక్రమంగా జరగకపోవడం, చెట్లు, ముళ్ళ పొదలు పెరిగి భక్తులకు అసౌకర్యం కలగడంతో, సమితి సభ్యులు ప్రాంగణంలోకి వెళ్లి స్వామివారికి అభిషేకం, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అమర్నాథ్ మురళి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్