భారత దేశంలోనే తొలి శివాలయంగా పేరుగాంచిన గుడిమల్లంలోని శ్రీ పరశురామేశ్వర స్వామిని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తన కుటుంబంతో కలిసి సోమవారం దర్శించుకున్నారు. ఆలయ కమిటీ, వేద పండితులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయ చరిత్రను వివరించే పుస్తకాన్ని ఆయనకు బహుకరించి, తీర్థప్రసాదాలు, కండువ, దుశ్యాలవంతో సత్కరించారు.