శ్రీకాళహస్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆంధ్రప్రదేశ్ ప్రజల వివక్షతను రూపుమాపి, తెలుగువారి అభివృద్ధికి కారణమైన పార్టీ కార్యకర్తల ఐక్యతే తెలుగుజాతికి రక్ష అని కొనియాడారు. నాలుగు దశాబ్దాల క్రితం వరకు వివక్షతను ఎదుర్కొంటున్న తెలుగు జాతిలో చైతన్యం తీసుకొచ్చి, ఆంధ్రుల ఆత్మగౌరవ పరిరక్షణకు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగుజాతి ఘనకీర్తిని విశ్వవ్యాపితం చేశారని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ దుర్గాప్రసాద్, ఉమేష్ రావు, వజ్రం కిషోర్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.