చిత్తూరు జిల్లాలో ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని శ్రీకాళహస్తి పాత్రికేయులు డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా ఎస్పీ, కలెక్టర్ వెంటనే స్పందించి, హంతకులను ఎన్కౌంటర్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు వి.సి. వెంకటయ్య, చంద్రయ్య, కోటేశ్వరరావు, హరీష్ చంద్ర, రఫీ, కచారి వెంకటయ్య, చిన్న చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సంఘటనపై పాత్రికేయ వర్గాల్లో తీవ్ర కలకలం రేగింది.