మాజీ మంత్రి గోపాలకృష్ణారెడ్డికి ఘనంగా నివాళులు: ఎమ్మెల్యే

6చూసినవారు
మాజీ మంత్రి గోపాలకృష్ణారెడ్డికి ఘనంగా నివాళులు: ఎమ్మెల్యే
శ్రీకాళహస్తి నియోజకవర్గ మాజీ మంత్రివర్యులు స్వర్గీయ శ్రీ బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి నాలుగో వర్ధంతి సందర్భంగా, కుటుంబ సభ్యులు ఆయన సమాధిని దర్శించుకుని, పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. వారితో గడిపిన క్షణాలు, తీపి జ్ఞాపకాలు మరోసారి కళ్ళముందు కదిలాయని కుటుంబ సభ్యులు తెలిపారు. భౌతికంగా లేకున్నా, ఆయన లోటు కుటుంబానికే కాకుండా శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలందరికీ తీరనిదని, ఆయన చేసిన అభివృద్ధి, ప్రజా సేవా మార్గమే స్ఫూర్తి అని పేర్కొన్నారు. ఆయన ఆశయ సాధనలో, అడుగుజాడల్లో నడుస్తూ శ్రీకాళహస్తి ప్రగతికి నిరంతరం కృషి చేస్తామని కుటుంబ సభ్యులు ప్రతిజ్ఞ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్