ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు ఇటీవల అనారోగ్యంతో హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్‌లో స్వర్గస్తులయ్యారు. ఆయన చిత్రపటానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీకాళహస్తి కోలా ఆనంద్ శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం, భాస్కర్ రావు కుమారుడు, ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి, జనసేన పీఏసీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్‌ను, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.