జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య, శ్రీకాళహస్తి నియోజకవర్గ అధ్యక్షులుగా శెంజిగరం వెంకటరమణయ్య (ఎస్. వి. రమణ)ను నియమించారు. నెల్లూరు పట్టణంలోని యాదవ ట్రస్ట్ భవన్ లో జరిగిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో ఈ నియామకాన్ని అధికారికంగా ప్రకటించి, ఆర్. కృష్ణయ్య చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎస్. వి. రమణ మాట్లాడుతూ, తనపై నమ్మకంతో ఈ కీలక బాధ్యతలు అప్పగించినందుకు ఆర్. కృష్ణయ్యకు కృతజ్ఞతలు తెలిపారు.