తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం విచ్చేసిన భారత ఉపరాష్ట్రపతి శ్రీ రాధాకృష్ణన్‌కు రేణిగుంట విమానాశ్రయంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా, కూటమి ప్రభుత్వం మరియు శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజల తరపున స్వాగతం పలకడం సంతోషంగా ఉందని తెలిపారు. శ్రీకాళహస్తి క్షేత్ర మహిమను చాటిచెప్పేలా జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి తీర్థ ప్రసాదాలను ఉపరాష్ట్రపతికి అందజేసి, స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నారు.