మహిళలు అప్రమత్తంగా ఉండాలి: సీఐ నాగరాజు

0చూసినవారు
మహిళలు అప్రమత్తంగా ఉండాలి: సీఐ నాగరాజు
శ్రీకాళహస్తి 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సీఐ నాగరాజు ఆధ్వర్యంలో మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలకు అందుబాటులో ఉన్న హెల్ప్ లైన్ నంబర్లు, వారి చట్టపరమైన హక్కులు, భద్రతా చర్యల గురించి వివరించారు. మహిళలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో పోలీసులను సంప్రదించాలని సీఐ సూచించారు. మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడమే ఈ కార్యక్రమ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్