శ్రీకాళహస్తిలో పెట్రోల్ బంకుల వద్ద వాహనాలతో కిక్కిరిసిపోయిన పరిస్థితి నెలకొంది. అధికారులు పెట్రోలుకు కొరత లేదని స్పష్టం చేసినా, ప్రజల్లో అపోహలు తొలగడం లేదు. పెట్రోల్, డీజిల్ దొరుకుతుందో లేదో అన్న అనుమానంతో వాహనదారులు భారీగా బంకుల వద్దకు చేరుకుని, తమ వాహనాలకు ఇంధనం నింపుకోవడంతో పాటు అదనంగా బాటిళ్లు, క్యాన్లలో నిల్వ చేసుకుంటున్నారు. ఈ పరిస్థితిని DSP నరసింహమూర్తి, వన్ టౌన్ సీఐ సమీక్షించారు.