శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, మెగా డీఎస్సీపై
వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమని అన్నారు.
వైసీపీ పాలనలో డీఎస్సీ నిర్వహించకుండా నిరుద్యోగ యువతను మోసం చేశారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 148 రోజుల్లోనే 15,941 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి హామీని నిలబెట్టుకుందని తెలిపారు. డీఎస్సీ పారదర్శకంగా జరిగాయని, రాజకీయ లబ్ధి కోసం
వైసీపీ తప్పుడు ప్రచారాలు మానుకోవాలని ఆయన సూచించారు.