
సూళ్లూరుపేట లాడ్జిలో మహిళ హత్య: నిందితుడు అరెస్ట్
సూళ్లూరుపేట రైల్వే గేట్ సమీపంలోని కృష్ణా లాడ్జిలో నవంబర్ 30న జరిగిన మహిళ హత్య కేసులో పోలీసులు నిందితుడు సుబ్రహ్మణ్యంను గురువారం అరెస్ట్ చేశారు. పొన్నేరికి చెందిన ఉష, సుబ్రహ్మణ్యం మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్టు విచారణలో తేలింది. లాడ్జిలో గది తీసుకున్న తర్వాత వివాదం తీవ్రమై, కోపంతో సుబ్రహ్మణ్యం ఉషను హత్య చేసి పారిపోయాడు. ప్రత్యేక బృందాలు నిందితుడిని తమిళనాడులో పట్టుకున్నాయని డీఎస్పీ చెంచుబాబు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోంది.








































