తడ మండలం మాంబాట్టులోని అపాచీ షూ కంపెనీలో మహిళల భద్రత, చట్టపరమైన హక్కులు, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 500 మంది మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. నాయుడుపేట డీఎస్పీ, సూళ్లూరుపేట సీఐ, తడ ఎస్ఐ ఈ అవగాహన కల్పించారు.