సులూరుపేట తడ(M) గ్రద్దగుంటలో కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో శ్రీ బాలాజీ మెడికల్ కాలేజీ & హాస్పిటల్ సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామస్తులను ప్రత్యేక బస్సులో తిరుపతికి తీసుకెళ్లి, అక్కడ ఉచిత చికిత్సతో పాటు భోజన వసతి కల్పించి, సురక్షితంగా తిరిగి గ్రామానికి చేర్చారు. పేదల ఆరోగ్యం పట్ల నాయకులు చూపిన ఈ దాతృత్వాన్ని స్థానికులు ప్రశంసించారు.