పులికాట్ సరస్సులో గులాబీ రంగు ఫ్లెమింగో పక్షులు

1233చూసినవారు
పులికాట్ సరస్సులో అక్టోబర్ నెలలో కనిపించే ఫ్లెమింగో పక్షులు మొదట్లో బూడిద రంగులో ఉంటాయి. ఇవి సరస్సులోని ఆల్గే, బ్రైన్ రొయ్యలు, చిన్న నీటి కీటకాలు, మొలస్క్‌లు వంటి సూక్ష్మ జీవులను తింటాయి. ఈ ఆహారంలో ఉండే కెరోటినాయిడ్స్ అనే వర్ణద్రవ్యాల వల్ల వాటి ఈకలకు అందమైన గులాబీ రంగు వస్తుంది. పులికాట్ సరస్సులో ఫ్లెమింగోల విన్యాసాలు చూడటానికి అద్భుతంగా ఉంటాయి.