కడపట్ర గ్రామంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. గ్రామపంచాయతీ పరిధిలో అందిన 177 అర్జీలను సంబంధిత అధికారులకు పంపించి వెంటనే పరిష్కరించాలని ఆమె ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.