
నేడు కొనసాగనున్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు విచారణ
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ హత్య కేసులో విచారణ నేడు కొనసాగనుంది. నిన్న విచారణకు సహకరించని అనంతబాబును, సాక్షులను ఎందుకు బెదిరించారని పోలీసులు ప్రశ్నించగా, తనకు తెలియదని బుకాయించారు. ఈరోజు మధ్యాహ్నం అనంతబాబును కోర్టులో ప్రవేశపెట్టి, అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నారు.




