సూళ్లూరుపేట: విద్యుత్ షాక్ తో రైతు మృతి

1100చూసినవారు
సూళ్లూరుపేట: విద్యుత్ షాక్ తో రైతు మృతి
ఓ అన్నదాత పొలంలోనే ప్రాణాలను విడిచిన ఘటన తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలంలో బుధవారం జరిగింది. పిన్నెపల్లెకు చెందిన రమణయ్య (58) పొలం దుక్కుతున్న సమయంలో కరెంటు వైర్లు ట్రాక్టర్ సైలెన్సర్ కు తగిలాయి. దీంతో రైతు అక్కడికక్కడే మరణించాడు. ఎస్ఐ నాగరాజు మృతదేహాన్ని నాయుడుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యానికి రైతు మృతి చెందాడని బంధువులు ఆరోపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్