రాష్ట్ర ఐటీ, పారిశ్రామిక శాఖ మంత్రి నారా లోకేష్ శ్రీసిటీని సందర్శించారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఆయనకు ఘన స్వాగతం పలికారు. రూ. 1000 కోట్ల పెట్టుబడితో క్యారియర్ ఏసీ తయారీ పరిశ్రమ ఏర్పాటుకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ పరిశ్రమ ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఎమ్మెల్యే తెలిపారు.