ఓజిలి పోలీస్ స్టేషన్‌లో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా గురువారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు ప్రారంభించారు. దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని ఆయన అన్నారు. కార్యక్రమంలో నాయుడుపేట రూరల్ సీఐ సంగమేశ్వరరావు స్వయంగా రక్తదానం చేశారు. నాయుడుపేట రూరల్ ఎస్ఐలు శ్రీకాంత్, నాగరాజు, అజయ్ కుమార్ పాల్గొన్నారు.