సూళ్లూరుపేట: స్కూల్ బస్సు బోల్తా;విద్యార్థులకు తప్పిన ప్రమాదం

9చూసినవారు
సూళ్లూరుపేట: స్కూల్ బస్సు బోల్తా;విద్యార్థులకు తప్పిన ప్రమాదం
సూళ్లూరుపేట మండలం దావాదిగుంట సమీపంలో మంగళవారం సాయంత్రం ఒక ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా పడింది. బ్రేకులు పనిచేయకపోవడమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 20 మందికి పైగా విద్యార్థులు, సిబ్బంది ఉన్నారు. అదృష్టవశాత్తు ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదు, స్వల్పంగా గాయపడినట్లు సమాచారం. ఈ ఘటనపై విచారణ జరుగుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్