సూళ్లూరుపేట: గంజాయి రవాణా చేస్తూ ఇద్దరు అరెస్ట్

51చూసినవారు
సూళ్లూరుపేట: గంజాయి రవాణా చేస్తూ ఇద్దరు అరెస్ట్
సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని డీఎస్పీ చెంచుబాబు మీడియాకు వెల్లడించారు. అరెస్టైన వారు బిబిన్నాథ్, రోహన్‌గా గుర్తించారు. వారి నుంచి 70.560కేజీల గంజాయి, 2మొబైల్ ఫోన్లు, ఓ వోక్స్ వేగన్ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించామని, వీరిపై గతంలో హత్యాయత్నం కేసులు ఉన్నాయని డీఎస్పీ తెలిపారు.

సంబంధిత పోస్ట్