
జయప్రకాశ్ రెడ్డి హత్య కేసులో తల్లి హస్తం?
శుక్రవారం గోళ్లతోపు గ్రామం గుడివారిపల్లికి చెందిన జయప్రకాష్ రెడ్డి(25) దారుణ హత్యకు గురైన కేసులో తల్లి హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, డీఎస్పీ మహీంద్ర ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన పోలీసులు, ఘటనాస్థలిలో లభించిన ఆధారాలను పరిశీలించి ఈ నిర్ధారణకు వచ్చారు. ఈ దారుణ హత్య కేసులో తల్లి ప్రమేయంపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.


































