కృష్ణా జిల్లా గన్నవరంలో 5వ తేదీన జరిగే హైందవ శంఖారావం సభను జయప్రదం చేయాలని బి. కొత్తకోట మండలం హిందూ ధర్మ సంఘం ఆధ్వర్యంలో గురువారం బైక్ ర్యాలీ నిర్వహించారు. బీసీ కాలనీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి బెంగళూరు రోడ్డు, జ్యోతి చౌక్ హరి మందిరం వీధి, దిగువ బస్టాండ్, బైపాస్ రోడ్, పిటియం రోడ్డు మీదుగా బైక్ ర్యాలీ నిర్వహించి హిందువులను చైతన్య పరిచారు.