
తిరుపతిలో శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ
తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో (SPMVV) స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని 'హర్ ఘర్ తిరంగా ర్యాలీ'ని బుధవారం నిర్వహించారు. NSS సమన్వయకర్త ప్రొఫెసర్ ఐ. వి. లలిత కుమారి, ప్రోగ్రామ్ ఆఫీసర్ డా. కె. ఆర్. పద్మ నేతృత్వంలో 65 మంది వాలంటీర్లు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. వాలంటీర్లు జాతీయ జెండాలను చేతబూని దేశభక్తి నినాదాలు చేస్తూ ప్రతి ఇంట్లో జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని అవగాహన కల్పించారు. ఈ ర్యాలీ జాతీయ ఐక్యతను చాటి చెప్పింది.







































