తిరుపతి జిల్లాలో నేటి నుంచే జనగణన ప్రారంభం

1చూసినవారు
తిరుపతి జిల్లాలో నేటి నుంచే జనగణన ప్రారంభం
తిరుపతి జిల్లాలో నేటి నుంచి నెల రోజుల పాటు జనగణన ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లాలో సుమారు 7 లక్షల కుటుంబాలు ఉండగా, ఇప్పటికే 80 వేల కుటుంబాలు ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసుకున్నాయి. మిగిలిన కుటుంబాల వివరాలను ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేటర్లు సేకరిస్తారు. ప్రతి ఇంటికి 33 ప్రశ్నలకు సమాధానాలు తీసుకోనున్నారు. జిల్లా వ్యాప్తంగా 4 వేలకుపైగా ఎన్యుమరేటర్లు ఒక్కొక్కరు సుమారు 200 ఇళ్ల వివరాలను సేకరిస్తారు. ప్రజలు ఖచ్చితమైన సమాచారం అందించాలని అధికారులు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్