ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్రాంతి పండుగ సందర్భంగా నాలుగు రోజుల పాటు నారావారిపల్లెలో పర్యటించనున్నారు. జనవరి 12న తిరుపతి సూళ్లూరుపేటలో ఫ్లెమింగో ఫెస్టివల్ ముగింపు వేడుకలకు హాజరవుతారు. అనంతరం, తన స్వగ్రామానికి చేరుకొని జనవరి 13, 14, 15 తేదీల్లో సంక్రాంతి వేడుకల్లో పాల్గొంటారు. ఈ పర్యటనలో భాగంగా, ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించడంతో పాటు శంకుస్థాపనలు కూడా చేయనున్నారు. జనవరి 15న ఉండవల్లిలోని తన ఇంటికి తిరిగి ప్రయాణమవుతారు.