తిరుచానూరులోని తోళ్లప్ప గార్డెన్‌లో ఉన్న శ్రీ వేంకటేశ్వర నిత్య అన్నప్రసాద వితరణ కేంద్రాన్ని టిటిడి ఈవో ఎం. రవిచంద్ర మంగళవారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అన్నప్రసాద వితరణ విధానాన్ని సమగ్రంగా పరిశీలిస్తూ భక్తులతో నేరుగా మాట్లాడారు. అన్నప్రసాదాల నాణ్యత, సమయపాలన, సేవల నిర్వహణపై వివరాలు తెలుసుకున్నారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, తాగునీరు, రాత్రి వరకు వితరణ సమయాలపై అధికారులను ప్రశ్నించి వివరాలు సేకరించారు.