శ్రీవారి గరుడ సేవ కోసం తిరుమలలో భక్తులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భక్తులకు భోజన, వైద్య సదుపాయాలతోపాటు అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ ఏర్పాట్లను ఈవో అనిల్ సింఘాల్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే గ్యాలరీలు భక్తులతో నిండిపోయాయి. ఎటు చూసిన ఆలయ ప్రాంగాణం భక్తులతో నిండిపోయింది.