హైదరాబాద్‌కు చెందిన మాక్స్ ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధి బి. వి. వి. ఎస్. ఎన్. రాజు, టీటీడీకి రూ. 1.20 కోట్ల విరాళం అందజేశారు. ఇందులో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో ఒకరోజు అన్నప్రసాద వితరణ కోసం రూ. 44 లక్షలు, శ్రీవేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు రూ. 76 లక్షలు విరాళంగా సమర్పించారు. దాత ఆదివారం తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరికి చెక్కులు అందించారు.