తిరుపతి ఎస్వీయూలో డ్రోన్ పైలట్ శిక్షణ ప్రారంభం

0చూసినవారు
తిరుపతి ఎస్వీయూలో డ్రోన్ పైలట్ శిక్షణ ప్రారంభం
తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం (ఎస్వీయూ)లో రూసా–2 కింద 15 రోజుల డీజీసీఏ–ఆర్పీటీఓ డ్రోన్ పైలట్ శిక్షణ కార్యక్రమాన్ని ఉపకులపతి ఆచార్య టాటా నరసింగరావు ప్రారంభించారు. ఆధునిక సాంకేతిక రంగంలో విద్యార్థులకు నైపుణ్యాలు పెంపొందించే లక్ష్యంతో ఈ శిక్షణ నిర్వహిస్తున్నారు. మొదటి రెండు బ్యాచుల్లో మొత్తం 40 మంది విద్యార్థులు పాల్గొంటున్నారు. డ్రోన్ ఆపరేషన్లు, మ్యాపింగ్, నిఘా, సర్వే వంటి అంశాలపై ప్రాక్టికల్ శిక్షణ ఇవ్వబడుతుంది. డీజీసీఏ అనుమతి పొందిన రాష్ట్రంలోని తొలి జనరల్ స్టేట్ యూనివర్సిటీగా ఎస్వీయూ గుర్తింపు పొందింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్