తిరుపతికి ఈవీ బస్సుల జోష్.. ఆగస్టులో 50ఈకేఏ బస్సులు

1చూసినవారు
తిరుపతి ఆర్టీసీ మంగళం డిపోకు ఆగస్టు నాటికి 50 ఈవీ బస్సులు రానున్నాయి. వీటితో మంగళం డిపో నుంచి పూర్తిస్థాయిలో ఈవీ బస్సులనే నడపాలని ఆర్టీసీ యోచిస్తోంది. 25మంది ప్రయాణికుల సామర్థ్యం గల 9 మీటర్ల ఈ బస్సులను తిరుమల–తిరుపతి మార్గంలో వినియోగిస్తారు. తిరుమల డిపోకు 100, శ్రీకాళహస్తికి 100, పుత్తూరుకు 50 ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలుకు ఈ నెల 5న టెండర్లు నిర్వహించనున్నారు. దీంతో జిల్లాలో ప్రజారవాణా మరింత పర్యావరణహితంగా మారనుంది.

సంబంధిత పోస్ట్