తిరుపతిలో గంగమ్మ జాతర సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నగరమంతా పారిశుద్ధ్యాన్ని మెరుగుపరుస్తున్నామని కమిషనర్ శారదాదేవి తెలిపారు. ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు మూడు షిఫ్టుల్లో చెత్తను తొలగించే చర్యలు చేపట్టినట్లు చెప్పారు. కీలక ప్రాంతాల్లో భక్తులకు తాగునీరు, మజ్జిగ పంపిణీకి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మార్కెట్ ప్రాంతంలో పొంగళ్లు పెట్టుకునే వారికి, జంతు బలులు నిర్వహించే వారికి నిర్ణీత ప్రదేశాలను కేటాయించారు.