ఏబీఎన్ రాధాకృష్ణపై వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలి.. వైఎస్ఆర్‌సీపీ నేతలు

584చూసినవారు
ఏబీఎన్ రాధాకృష్ణపై వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలి..  వైఎస్ఆర్‌సీపీ నేతలు
మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్ రాధాకృష్ణపై తక్షణమే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని వైఎస్ఆర్‌సీపీ నేతలు డిమాండ్ చేశారు. భూమన కరుణాకర రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి ఏఎస్పీకి సోమవారం వినతిపత్రం అందజేశారు. ఇప్పటికే పలు స్టేషన్లలో ఫిర్యాదులు చేసినా పోలీసులు చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా నిందితుడిపై వెంటనే చట్టపరమైన విచారణ జరిపి న్యాయం చేయాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్