తిరుమల శ్రీవారి సేవలో మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్

2చూసినవారు
భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ తన కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. వైకుంఠం వద్దకు చేరుకున్న ఆయనకు టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

ట్యాగ్స్ :