తిరుపతిలో భారీ వర్షం.. జలమయమైన రహదారులు

5చూసినవారు
తిరుపతిలో ఆదివారం సాయంత్రం బలమైన ఈదురుగాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉక్కపోతతో ఇబ్బంది పడిన భక్తులు, స్థానికులకు ఉపశమనం లభించింది. అయితే, గాలివాన కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి, కొన్ని చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రహదారులపై భారీగా వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్