అలిపిరిలో భారీగా ట్రాఫిక్ జామ్

4567చూసినవారు
అలిపిరిలో భారీగా ట్రాఫిక్ జామ్
తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం గరుడ వాహన సేవ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో తితిదే భారీ ఏర్పాట్లు చేసింది. అలిపిరిలో వాహనాల తనిఖీలతో భారీ రద్దీ నెలకొంది. శ్రీనివాసుడి గరుడ సేవను వీక్షించేందుకు భక్తులు శనివారం రాత్రి నుంచే నిరీక్షిస్తున్నారు. గ్యాలరీల్లో ఉన్న భక్తులకు తితిదే సిబ్బంది పాలు, బిస్కెట్లు అందజేశారు. 4 మాడ వీధుల్లో పర్యవేక్షణకు 64 మంది ప్రత్యేక సిబ్బంది, 14 మంది ప్రత్యేక అధికారులను నియమించారు.

సంబంధిత పోస్ట్